పచ్చికబయళ్ళపై
పవ్వళించే కుసుమాలకు
కొనేటినీటిపై
కొలువుదీరే కుసుమాలకు
పర్వతశిఖరాలపై
పరిమళించే కుసుమాలకు
సెలయేటి గట్టుపై
సేదతీరే కుసుమాలకు
ఆహ్వనం పంపించితి
నీ పాదార్చనకై.
నా అహ్వానం అందకమునుపే..
గ్రీష్మ ప్రతాపానికి
తాళలేక
వాడిపొవునేమో
మహాత్మా! వాడనీకు
నేలరాలునేమో
మహాత్మా! రాలనీకు
No comments:
Post a Comment