Thursday, January 12, 2012

చెరువులు నదులలోకి
నదులు సముద్రాలలోకి
కలిసిపోతూవుంటే...
నేను మాత్రం
నా అంతరంగంపై
ప్రవహించి
అనంతంలోకలిసిపొతుంటాను
ఆ అనంతం నీవేనెమో!

Thursday, November 4, 2010

నీవస్తున్నావని
నేకలగని
హేమంతంలో..
ఓ నిశీధిలో...
నే హిమబింధువునై రాలితి
ఓ గడ్డిపొచపై.
నిన్ను ప్రశంసిస్తూ
నీపై గెయాల్ని అల్లుతూ
ప్రకృతి గానంతో
నా గళాన్ని కలిపి
గొంతుబొంగురుపొయెవరకు
పాడిపాడి
నీకై నిరీక్షించితి.
నీరాకకై తపించితి.
పక్షులు నిద్రలేచె.
భానుడు ఉదయించె.
అస్తమించె.
నీ రాకకై వేచి వేచి
నే ఆవిరైపోతి
నీవెక్కడ?
తల్లిలేని పిల్లలగని
హృదయం ద్రవించి 
తల్లివై ఆదరిస్తున్నవేమో!
ఆకలిగొన్న పేదవాల్ల
ఆకలితీర్చడానికి
అన్నమయ్యావేమో!   

Monday, September 20, 2010

ఎవరివో ..
ఏలోకం వాడివో...
ఈ లోకందాకా వచ్చి..
నన్నొదిలి వెళ్ళావు  
ఈ భువితీరాన ఆడుకోమని.  

తీరాన ఎగిసిపడే
అలలలను ఎదురీదే ..
ఈ అల్లరిపిల్లలతో ..
నన్ను ఆడమంటే
నేనెలా ఆడగలను?
నా కాల్లలో సత్తువలేదు
నా గుండెలో ధైర్యం లేదు
ఆడుకొనీ.. 
వాల్లను ఆడుకోనీ ..
నన్ను మాత్రం ఒంటరిగా..
మౌనంగా...
గత జ్ఞాపకాల గవ్వలను ఏరుకొనీ.            
 

Saturday, September 18, 2010

ఉన్నవాల్లు దూరమై
లేనివాల్లు దూరమై
తోడులేని 
నీడలేని
మమతలేని
సమతలేని
ఈ జగాన
జీవితం వ్యర్థమని 
ఓంటరిగా
ఈ బ్రతుకుటెడారిలో
ఓ బటసారినై
ఆమడలునడిచి
అమరపురికేగితి
నిన్నుచేరాలని.
తోడునేనుంటానని  
నీడనేనవుతానని
మమత చూపిస్తానని
సమత సృష్టిస్తానని 
నన్ను ఓదార్చి
నాకన్నీరు తుడిచి
నన్ను విడిచి వెళ్ళావు
ఈబతుకుటెడారిలొ.
ఓంటరితనం
నన్ను మల్లీ కబళించింది
మమతకరువైంది
మనసు బరువైంది
ఓ మృత్యుగీతం ఆలపించరాదా!
ఆలకిస్తూ మృత్యువొడిలోకి జారుకుంటాను!                             

Tuesday, August 24, 2010

ఈ లోకం
నీది కాదు
నాదికాదు
నీవు దానం చెసిన ధనానికి
వడ్డీలు కట్టమనే
మూర్ఖులది
వడ్డీవ్యాపారులది.
రజోగుణం
కలియుగం.
అప్పులకు వడ్డీలుకట్టి
వడ్డీలకు వడ్డీలుకట్టి
అప్పు అనే పదాన్ని
అసహ్యించుకునే నాకు
ఈలొకంతొ రుణం తీరింది. 
మిగిలిందొక్కటే
నా అవసరనిమిత్తమై 
మునుపటిజన్మ కర్మఫలాన
నా ఆత్మ సాక్షిగా
నీదగ్గర తీసుకున్న అప్పు
నే కప్పుకున్న తనువు
ఎప్పుడురాస్తున్నావు మరి నాకు మ్రుత్యులేఖ?            

Thursday, August 19, 2010

నిన్ను దూషించి
నీ ఉనికిని ప్రశ్నించి
మేమే దేవతలమంటుంది 
ఈ మూర్ఖ మానవలోకం
కనులున్న గుడ్డిలోకం.
చెవులున్న చెవిటిలోకం.

సూర్యునివై నీవు
కిరణాల కిరీటాలని ధరించి
యుగయుగాలుగా ఉదయించి
ఈ పృద్విని వెలిగించి
జీవరాశిని బ్రతికించే
నిన్ను దూషించి
నీ ఉనికిని ప్రశ్నించి
మేమే దేవతలమంటుంది   
ఈ మూర్ఖ మనవలోకం.
కనులున్న గుడ్డిలోకం.

చంద్రునివై ప్రకాశించి
లోకం నిద్ర పొయేవరకు
వెన్నెల్లొ జోలపాడి
లోకాన్ని జోకొట్టి
శోకాన్ని మరిపించే
నిన్ను దూషించి
నీ ఉనికిని ప్రశ్నించి
మేమే  దేవతలమంటుంది     
ఈ మూర్ఖ మనవలోకం.
చెవులున్న చెవిటిలోకం.

Wednesday, August 18, 2010

నా హృదయం తెల్లకాగితమై
నీ కలం పాదాల్ని పట్టుకుని
కంటనీరు పెట్టుకున్నది
నారాతను కుదురుగా రాయమని.
ఓ మహా జీవనరచయితా!
కోటిరాతలు రాయాలని తొందరపడి
నా తలరాతను రాయవుకదా!